బండి సంజయ్ పాదయాత్రలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్

by Disha Web Desk 2 |
బండి సంజయ్ పాదయాత్రలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటి జీవితారాజశేఖర్ బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రజా సంగ్రామ యాత్ర మూడో విడతలో భాగంగా శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పొడిచేడు గ్రామంలో బండి సంజయ్‌ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో సినీ నటి జీవితా రాజశేఖర్ దంపతులు పాల్గొని బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపారు. కాగా, వీరిద్దరూ ఈ మధ్య కాలంలోనే బీజేపీ పార్టీలో చేరారు. దీంతో రానున్న ఎన్నికల బరిలో బీజేపీ తరపున జీవితా రాజశేఖర్ దంపతులు కూడా ఉండనున్నారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.


Next Story