కానిస్టేబుల్ కుటుంబాన్ని పరామర్శించిన పోలీసులు..

223

దిశ, అశ్వారావుపేట టౌన్: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఇటీవల మృతి చెందిన కానిస్టేబుల్ కుటుంబాన్ని పోలీసులు పరామర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే నార్లపాటి వెంకట్ (వెంకట నాగేశ్వరరావు) ఇటీవల మృతి చెందాడు. గత సంవత్సరం డిసెంబర్ 7వ తారీఖున పోలీస్ వెహికల్ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స పొందుతూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 15న తుది శ్వాస విడిచాడు.

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విధినిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకునే క్రమంలో కానిస్టేబుల్ నార్లపాటి వెంకట్ కుటుంబాన్ని సీఐ బంధం ఉపేంద్రరావు, ఎస్సై చల్లా అరుణ, ఏఎస్ఐ సత్యనారాయణ, కానిస్టేబుల్ భవాని పరామర్శించారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ వెంకట్ భార్య పిల్లలకు పండ్లు దుస్తులను అందజేశారు. కానిస్టేబుల్ వెంకట్ ను కోల్పోవడం పోలీస్ కుటుంబానికి కూడా తీరనిలోటని వెంకట్ తో ఉన్న అనుబంధాన్ని గత జ్ఞాపకాలను కుటుంబ సభ్యులతో పోలీసులు పంచుకున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..