అన్నం పెడుతానంటే అడ్డుకున్న పోలీసులు.. రేవంత్ ఆగ్రహం

by  |
అన్నం పెడుతానంటే అడ్డుకున్న పోలీసులు.. రేవంత్ ఆగ్రహం
X

దిశ, తెలంగాణ బ్యూరో : గాంధీ ఆస్పత్రి ఆవరణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న ఉచిత భోజనానికి ప్రభుత్వం బ్రేక్​ వేసింది. ఈ భోజనాన్ని సరఫరా చేసేందుకు వెళ్తున్న మల్కాజిగిరి ఎంపీ రేవంత్​రెడ్డిని బేగంపేట వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ పోలీసులు, ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో భోజన సరఫరా కార్యక్రమానికి వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. అక్కడి నుంచే పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అయినా ఎంపీకి అనుమతి లభించలేదు. ఈ సంఘటన ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

రాష్ట్రంలోని పలు ఆస్పత్రుల్లో కరోనా రోగులతో పాటు సిబ్బంది, పలువురు పేషెంట్ల బంధువులకు సకాలంలో సరైన ఆహారం దొరకడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం కూడా రూ. 5 భోజనాన్ని ఎత్తివేసింది. దీంతో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ ఆదేశాల మేరకు గాంధీ ఆస్పత్రి వద్ద వెయ్యి మందికి ఉచితంగా ఆహారం పంపిణీ చేసేందుకు నిత్యాన్నదానం కార్యక్రమాన్ని శనివారం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. దీనిలో భాగంగా ఆదివారం మధ్యాహ్నం భోజనాన్ని తీసుకువెళ్లేందుకు ఎంపీతో పాటు కాంగ్రెస్​ నేతలు గాంధీ ఆస్పత్రి వైపు వెళ్తుండగా… పోలీసులు బేగంపేట దగ్గర అడ్డుకోవడం గమనార్హం.

Next Story