‘నకిలీ’ కోసం పోలీసుల విచారణ

by  |
‘నకిలీ’ కోసం పోలీసుల విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌లో నకిలీ చెక్కుల వ్యవహారం కలకలం రేపుతోంది. కోట్ల రూపాయలను పక్కదారి పట్టించేందుకు నకిలీ చెక్కులను సృష్టించినట్టు.. రెవెన్యూశాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివిధ ఎస్బీఐ బ్రాంచీల పేరుతో నకిలీ చెక్కుల ద్వారా నగదు తీసుకునేందుకు యత్నించారని అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు.

బ్రాంచీల వివరాలు:

కోల్‌కతా, ఢిల్లీ ఎస్బీఐ బ్రాంచ్‌కు రూ. 24.65 కోట్ల నకిలీ చెక్కులు..
ఢిల్లీలోని CCPCI ఎస్పీఐ బ్రాంచ్‌కు రూ. 39.85 కోట్ల నకిలీ చెక్కులు..
బెంగళూరులోని మంగళూరులో మూడ్ బాద్రీ శాఖకు 52.65 కోట్ల నకిలీ చెక్కులు వెళ్లినట్టు రెవెన్యూ అధికారులు పోలీసులకు వివరణ ఇచ్చారు. దీంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగం చేశారు. ఈ నేపథ్యంలోనే సచివాలయ ఎస్బీఐ శాఖ సిబ్బందిని కూడా ప్రశ్నించనున్నారని సమాచారం.

Next Story

Most Viewed