అడవి బిడ్డలకు ఖాకీల సాయం.. ఏం చేశారంటే..!

by  |
అడవి బిడ్డలకు ఖాకీల సాయం.. ఏం చేశారంటే..!
X

దిశ, భద్రాచలం : అటవీ ప్రాంత వలస ఆదివాసీలకు పోలీసులు చిరు సహాయం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చర్ల మండలంలో మారుమూల అటవీప్రాంత పులిగుండాల, కొండవాయి గ్రామాల్లో నివసిస్తున్న ప్రతీ కుటుంబానికి ఒక వాటర్ ఫిల్టర్, దోమతెరలు, గ్రామానికో టీవీ పంపిణీ చేశారు. ఓఎస్‌డి వి. తిరుపతి, భద్రాచలం ఏఎస్‌పి డాక్టర్ వినీత్, చర్ల సీఐ బి.అశోక్, సిఐ రాజగోపాల్, చర్ల ఎస్ఐ రాజువర్మల చేతుల చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఓఎస్‌డి తిరుపతి మాట్లాడుతూ.. అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనుల ఆరోగ్యం పట్ల పోలీసుశాఖ ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతోందని అన్నారు. వర్షాకాలంలో వాగు నీటిని త్రాగి గుత్తి కోయ గ్రామాల్లో నివసించే పిల్లలు, పెద్దలు, వృద్ధులు అనారోగ్యం బారీన పడకుండా ఉండేందుకు, స్వచ్ఛమైన నీటిని వారికి అందించి, అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ కుటుంబానికి వాటర్ ఫిల్టర్‌‌తోపాటు దోమతెరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ సోకి ఇబ్బందులు పడుతున్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తే ఎలాంటి కేసులు లేకుండా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి వచ్చే విధంగా సదరు కుటుంబీకులు కృషి చేయాలని చేయాలని పిలుపునిచ్చారు.

Next Story