ఈ దీపావళికి కొత్త నిబంధనలు.. ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ శాఖ

by  |
ఈ దీపావళికి కొత్త నిబంధనలు.. ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ శాఖ
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్ : దీపావ‌ళి పండుగ‌ను సుర‌క్షితంగా, సంతోషంగా జ‌రుపుకోవాల‌ని పోలీసుశాఖ మార్గ ద‌ర్శకాలు జారీ చేసింది. గ‌తంలో అనుమ‌తులు లేకుండా, ఎలాంటి భ‌ద్రతా చ‌ర్యలు తీసుకోకుండా స్టాల్స్ ఏర్పాటు చేయ‌డంతో కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ప్రజల ర‌క్షణ‌ను దృష్టిలో ఉంచుకొని 2018లో సుప్రీంకోర్టు ప‌టాకుల విక్రయాల పై భ‌ద్రత చ‌ర్యల‌ు తీసుకోవాలని మార్గద‌ర్శకాలు జారీ చేసింది. దీంతో పోలీసుశాఖ దృష్టి సారించింది. ప‌టాకుల దుకాణాల నిర్వహ‌ణ‌పై నిరంత‌ర ప‌ర్యవేక్షణ‌ చేప‌ట్టాల‌ని నిర్ణయించింది.

సైలెంట్ జోన్లలో నిషేధాజ్ఙలు..

ప‌టాకుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలంటే క‌చ్చితంగా నింబంధ‌న‌లు పాటించాల‌ని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్లో అనుమ‌తుల విధానాన్ని ప్రవేశ‌పెట్టారు. అందులో ప‌ర్మిష‌న్ పొందిన వారు మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి. సుప్రీంకోర్టు మార్గద‌ర్శకాల ప్రకారం.. సైలెంట్ జోన్లలో ప‌టాకుల అనుమ‌తిపై నిషేదాజ్ఞలు ఉన్నాయి. విద్యాసంస్థలు, కోర్టులు, దేవాల‌యాలు ఉన్న ప్రదేశాలకు వంద మీట‌ర్లలో ఎక్కడా ప‌టాకుల షాపుల‌ను ఏర్పాటు చేయ‌కూడ‌దు. ఒక్కో దుకాణానికి క‌నీస దూరం పాటించాలి. ప్రతి దుకాణం వ‌ద్ద ఫైర్ కంప్రేషింగ్ సిలీండ‌ర్లు, ఇసుక‌తో పాటు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి. పోలీసు శాఖ అనుమ‌తితోనే ప‌టాకుల దుకాణాలు ఏర్పాటు చేసుకోవాల‌న్న నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఎల్బీన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో 56, వ‌న‌స్థలిపురం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో 65, హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో 62, చైత‌న్యపురి పీఎస్ ప‌రిధిలో 58, స‌రూర్‌న‌గ‌ర్ పీఎస్ ప‌రిధిలో 52 దుకాణాల‌కు అనుమ‌తి ల‌భించింది.


Next Story

Most Viewed