ఆ బంగారం దొరికిందోచ్..

by Sridhar Babu |
ఆ బంగారం దొరికిందోచ్..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లాలో జరిగిన ఓ బంగారం చోరీ మిస్టరీని పోలీసులు చేధించారు. గంటల వ్యవధిలోనే పోలీసులు భారీగా చోరీకి గురైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున రామగుండం సమీపంలోని మల్యాలపల్లి క్రాసింగ్ వద్ద కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన బంగారం వ్యాపారులు తెలంగాణలోని మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ ప్రాంతాలకు బంగారు ఆభరణాలు సరఫరా చేస్తుంటారు.

ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత వారి వెంట తీసుకొచ్చిన 3.5 కిలోల బంగారం దొరకలేదు. దీంతో పోలీసులకు బాధిత కుటుంబాలకు చెందిన వారు 5.6 కిలోల బంగారు ఆభరణాలు ఉండాలని ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాదం జరిగిన చోటుతో పాటు క్షతగాత్రులను తరలించిన అంబూలెన్స్ సిబ్బందిని విచారించారు. వారి నుంచి 2 కిలోల 100 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని రామగుండం సీఐ కరుణాకర్ రావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు.Next Story

Most Viewed