ఫ్లాష్.. ఫ్లాష్.. గంటల్లోనే దొంగతనం మిస్టరీని చేధించిన పోలీసులు..

by  |
ఫ్లాష్.. ఫ్లాష్.. గంటల్లోనే దొంగతనం మిస్టరీని చేధించిన పోలీసులు..
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని వెళుతున్న మహిళల నుండి గుర్తు తెలియని దుండగులు రూ.2 లక్షలు చోరీ చేశారు. ఈ మేరకు సదరు మహిళలు 100కు కాల్ చేసి ఫిర్యాదు చేయడంతో, సంఘటన స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అయితే ఈ దొంగతనం మిస్టరీని పోలీసులు గంటల్లోనే చేధించడం విశేషం. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పులిగిల్ల స్వప్న, పులిగిల్ల రాధా, ముక్కెర సమ్మక్క లు స్థానిక ఎస్బీఐలో రూ.2 లక్షలు మహిళా పొదుపు సంఘం నుండి రుణం తీసుకున్నారు.

అట్టి మొత్తాన్ని తీసుకుని నడుచుకుంటూ బస్టాండ్‌కు వెళ్తుండగా, గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి మహిళల చేతిలో ఉన్న డబ్బు కవర్‌ను లాక్కొని పారిపోయారు. ఈ ఊహించని ఘటనతో ఖంగుతిన్న బాధిత మహిళలు 100కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏసీపీ వైభవ్ రఘునందన్ గైక్వాడ్ నేతృత్వంలో స్థానిక సీఐ శ్రీనివాస రెడ్డి, ఎస్సైలు రమేష్ నాయక్, శ్రీనివాస్, మహేందర్ లు నాలుగు టీంలుగా ఏర్పడి సీసీటీవీ ఫుటేజీలు, ఐటీ సహకారంతో నిందితులు పట్టుకున్నారు. నిందింతులు నమిలికొండ గ్రామానికి చెందిన గాదె విష్ణు, గాదె వంశీ లుగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుండి రూ.2లక్షలతో పాటు స్కూటీ, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి..

దొంగతనాలు, హత్యలు, దోపిడీలు జరగకుండా ఉండేందుకు, అలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఏసీపీ తెలిపారు. జాతీయ రహదారి పైనే కాకుండా ప్రతి గ్రామంలో కెమెరాలు ఏర్పాటు చేసుకుని ప్రజలు భద్రంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో ఐడి పార్టీ కుమార్, రవీందర్, నవీన్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story

Most Viewed