సీపీ ఎస్. వారియర్ కీలక ఆదేశాలు.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం

by  |
సీపీ ఎస్. వారియర్ కీలక ఆదేశాలు.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం
X

దిశ ఖమ్మం టౌన్ : ఖమ్మం జిల్లాలో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ అధికారులకు ఆదేశించారు. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో స్ధానిక పోలీసులు తమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోడ్లు, గ్రామాలు జలమయమయ్యే ప్రాంతాలలో ప్రజలకు అందుబాటులో వుంటూ ఎటువంటి ఆటంకాలు కలగకుండా తక్షణమే పర్యవేక్షించి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.అదేవిధంగా చెరువులు, కుంటల వద్ద నీటి ఉధృతిని దృష్టిలో ఉంచుకుని వంతెనలపై బారీకేడ్స్ ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా వాహనాల రాకపోకలను నిషేధించాలని సూచించారు.

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉంటుందని, కావున రోడ్డు రవాణా, విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడకుండా విద్యుత్, రెవెన్యూ, ఆర్ & బీ శాఖ అధికారుల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులకు ఆదేశించారు. రెండు రోజులు పరిస్థితి ఇలాగే ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్ళొద్దని పోలీస్ కమిషనర్ ఎస్ వారియర్ సూచించారు.


Next Story

Most Viewed