కూతురి పెళ్లి.. ఆనందంతో అల్లుడిని తీసుకొస్తుండగా..!

by  |
కూతురి పెళ్లి.. ఆనందంతో అల్లుడిని తీసుకొస్తుండగా..!
X

దిశ, మహబూబూబాద్ : కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించాలనుకున్న తండ్రికి కరోనా షాక్ ఇచ్చింది. లాక్‌డౌన్‌లో నిర్వహించే శుభకార్యాల్లో 40 మంది కంటే మించొద్దని సర్కార్ ముందుగానే కుండబద్దలుగొట్టి మరీ చెప్పింది. కూతురు పెళ్లాయే ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు. దీంతో కొవిడ్ నిబంధనలను పక్కన పెట్టాడు. తీరా అల్లుడిని తీసుకొస్తుండగా సడన్ ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అమ్మాయి తండ్రిపై కేసు నమోదు చేశారు. దీంతో వివాహానికి వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన మహబూబూబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని అమీనాపురం గ్రామంలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. కే సముద్రం మండలం అమీనాపురం గ్రామంలో వల్లాపు అశోక్ తన కూతురు వివాహాన్ని జరిపిస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి కుమారుడిని ఊరేంగింపుగా తీసుకువచ్చారు. గ్రామ పొలిమేర నుంచి ఎదుర్కోలు కార్యక్రమంలో నిర్వహించగా.. అందులో సుమారు 100 మందికి పైగా పాల్గొన్నారు. కొవిడ్ ఉధృతిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న కే సముద్రం తహశీల్దార్ సరితా రాణికి ఈ పెళ్లి తంతు ఎదురు కావడంతో ఆమె ఆగ్రహించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన పెళ్ళి కుమార్తె తండ్రి అశోక్ పై కేసు నమోదు చేయాలని ఎస్ఐ రమేష్ బాబును ఆదేశించారు. ఎమ్మార్వో ఆదేశాల మేరకు కొవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన అశోక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story