మహాత్ముడు మాకు సర్వస్వం: మోదీ

by  |
మహాత్ముడు మాకు సర్వస్వం: మోదీ
X

జాతిపిత మహాత్మా గాంధీపై బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే చేసిన అనుచిత వ్యాఖ్యలపై లోక్‌సభలో దుమారం రేగింది. అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. ప్రతిపక్ష ఎంపీల నినాదాల మధ్యనే ప్రధాని మోదీ మాట్లాడటం కోసం లేచి నిలబడ్డారు. ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మహాత్మా గాంధీ వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఇంతేనా ఇంకేమైనా ఉందా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. కొద్ది నిమిషాలు మోదీ ప్రసంగించిన తర్వాత లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని అన్నారు. దీనిపై మోదీ స్పందిస్తూ మహాత్మా గాంధీ మీకు కేవలం ట్రైలర్ మాత్రమేనేమో మాకు సర్వస్వమని బదులిచ్చారు. ఇటీవల మహాత్మాగాంధీపై బీజేపీ ఎంపీ అనంత్‌కుమార్ హెగ్డే అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చరిత్ర పుస్తకాలు చదువుతున్నంత సేపు తన రక్తం మరిగిపోయిందని, గాంధీ స్వాతంత్ర్యం పోరాటం మొత్తం ఓ నాటకమన్నారు. స్వాతంత్ర్య పోరాటం మొత్తం బ్రిటిష్ వారి మద్దతు, సంప్రదింపులతోనే కొనసాగిందన్నారు. దీనిపై బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా స్పందించింది. అనంత్‌కుమార్ హెగ్డే వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని పార్టీకి సంబంధం లేదని తెలిపింది. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అనంతకుమార్ హెగ్డేను ఆదేశించింది.


Next Story

Most Viewed