మోడీ కేబినెట్ మాజీ మంత్రి సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్ బై

by  |
babool-supriyo
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. ఇకమీదట తాను ఏ పార్టీలో చేరబోనని, అసలు రాజకీయాల్లోనే ఉండనని స్పష్టంచేశారు. ఇటీవల ప్రధాని మోడీ మంత్రి వర్గ విస్తరణ చేపట్టిన క్రమంలో పలువురు కేంద్ర మంత్రులను తొలగించిన విషయం తెలిసిందే. మొత్తం 12 మంది కేంద్ర మంత్రుల్లో బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో కూడా ఉన్నారు. కాగా, ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించలేదు.

Next Story

Most Viewed