పండుగ స్పెషల్.. వినూత్నంగా భోగి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ

90

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల ప్రజలు నేడు భక్తి శ్రద్దలతో భోగి పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలను తెలియజేశారు.

తెలుగు భాషలో గ్రీటింగ్ కార్డు రూపంలో ట్విట్టర్‌లో మోడీ.. ‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ మన సమాజంలో ఆనందమయ స్ఫూర్తిని పెంపొందింపజేయుగాక. అందరికీ మంచి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని శుభాకాంక్షలు చెప్పారు. పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.