నెట్‌ఫ్లిక్స్‌లో ఇక గేములు ఆడండి..

by  |
Netflix
X

దిశ, వెబ్‌డెస్క్ : నెట్‌ఫ్లిక్స్ మొబైల్ గేమింగ్‌ను ఆండ్రాయిడ్ మరియు iOS సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి తెచ్చింది. సబ్‌స్క్రైబర్‌లకు రెండు మొబైల్ గేమ్‌లను అందుబాటులో ఉంచింది. భవిష్యత్తులో మరిన్ని గేములను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్రాస్టీ పాప్ ద్వారా షూటింగ్ హోప్స్, ఫ్రాస్టీ పాప్ ద్వారా టీటర్ అప్, అముజో, రోగ్ గేమ్‌ల కార్డ్ బ్లాస్ట్ అనే పజిల్ కార్డ్ గేమ్ నుండి స్ట్రేంజర్ థింగ్స్ మెుదలైన గేమ్‌లు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటాయి. అయితే ఈ గేమ్‌లను యాక్సెస్ చేయడానికి సబ్‌స్క్రైబర్‌ అయి ఉండాలి.

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ రూ.199 నుండి ప్రారంభమై రూ.799 వరకు ఉంటుంది. గేమ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, నెట్‌ఫ్లిక్స్ IDని ఉపయోగించి సైన్ ఇన్ కావాలి. అయితే, మీరు ఇప్పటికే మీ స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ఫ్లిక్స్ యాప్ సైన్ ఇన్ చేసి ఉంటే, అది లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా మిమ్మల్ని గేమ్‌లోకి సైన్ ఇన్ చేస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు డెడికేటెడ్ ట్యాబ్‌తో నెట్‌ఫ్లిక్స్ యాప్ ద్వారా నేరుగా గేమ్‌లను యాక్సెస్ చేయగలుగుతారు.


Next Story

Most Viewed