‘బండి సంజయ్ హత్యకు ప్లాన్’

by Shyam |
‘బండి సంజయ్ హత్యకు ప్లాన్’
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను అడుగడుగునా అడ్డుపడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురులు డీకే అరుణ ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని విచ్చల విడిగా డబ్బు, మద్యాన్ని పంచుతూ అధికార దుర్వినియోగానికి టీఆర్ఎస్ నాయకులు పాల్పడ్డారని.. ఆమె ఆరోపించారు. అధికార యంత్రాంగం మొత్తం టీఆర్ఎస్ కు తొత్తులుగా మారిందని.. మైలార్ దేవ్ పల్లిలో ఎమ్మెల్యేనే తన అనుచరులతో బీజేపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. సోమవారం రాత్రి నెక్లెస్ రోడ్డులో టీ తాగి వెళ్తున్న సంజయ్ పై దాడికి ప్రయత్నించారని.. అంత జరుగుతున్నా ఒక్కరిద్దరు పోలీసులు తప్ప ఎలాంటి పోలీస్‌ఫోర్స్ లేదని విమర్శించారు. బండి సంజయ్ ను అడ్డుకుని దాడి చేసిన వారిపై ఇంత వరకు కేసులు నమోదు చేయలేదని విమర్శించారు.

ఎన్నికల కమిషన్ గులాబీ కండువా కప్పుకుంది

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీ తీరును వ్యతిరేకిస్తూ గాంధేయ మార్గంలో ఉపవాస ధీక్ష చేపట్టినట్లు బీజేపీ నాయకులు వెల్లడించారు. మంగళవారం పోలింగ్ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి ఓబిసి జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ధీక్షలో కూర్చున్నారు. ఆయనకు మద్దతుగా బిజెపి సీనియర్ నేతలు వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. పోలింగ్ కు కొన్ని గంటల ముందు అధికార పార్టీ ఎంఎల్ఏలు, మంత్రులు, నాయకులు పోలీసులను పెట్టుకుని విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు.. మద్యం పంపిణీ చేశారని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికలను ప్రజాస్వామ్యం బద్దంగా, స్వేచ్చగా, ప్రశాంతంగా జరపాల్సిన ఎన్నికల కమిషన్ గులాబీ కండువా కప్పుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ లోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కేసీఆర్ కుటుంబ పాలన వద్దనుకుంటున్నారని.. అధికార పార్టీ కి తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.Next Story

Most Viewed