మంచుకొండల్లో సేదతీరుతున్న టాలీవుడ్ స్టార్ హీరో.. పిక్స్ వైరల్

149
ram charan

దిశ, సినిమా: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన బిజీ షెడ్యూల్స్ నుంచి చిన్న విరామం తీసుకున్న చెర్రీ.. సూర్యోదయాన మంచు కొండల్లో సేదతీరుతూ కన్పించగా.. ‘బ్యూటిఫుల్ లుక్స్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా చరణ్ తన సోదరితో కలిసి స్విట్జర్లాండ్‌ వెకేషన్‌కు వెళ్ళాడని, త్వరలోనే ఇండియాకు తిరిగొస్తాడని తెలుస్తోంది.

ఇక తను నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కు సంబంధించి మేకర్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు ఈవెంట్స్, ప్రీ-రిలీజ్ ఈవెంట్స్, మీడియా ఇంటరాక్షన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వెకేషన్ నుంచి తిరిగి రాగానే చరణ్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. మరోవైపు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానున్న విషయం తెలిసిందే.