కీడు తొలగిపోవాలి తల్లీ.. గ్రామాల్లో వనభోజనాల సందడి..

by  |

దిశ, పరకాల : పరకాల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వనభోజనాల సందడి నెలకొంది. రాబోయే దసరా ఎలాంటి ఆటంకాలు లేకుండా కీడు తొలగి సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకోవడం కోసం ప్రతీ దసరా ముందు ఇలా వనభోజనాలకు వెళ్లడం ఆనవాయితీ అంటున్నారు ఆయా గ్రామాల ప్రజలు.

ఆదివారం దామెర మండలం పులకుర్తి, ల్యాదల్ల గ్రామాల్లో ఉదయాన్నే గ్రామస్తులు ఇండ్లలో నుంచి ఊరి బయటకు వంటలకు రావడం ‘దిశ’కు కనిపించింది. దీంతో వనభోజనాలకు వచ్చిన వారితో మాట్లాడగా దసరా పండగ ముందు కుటుంబంలో ఎలాంటి కీడు జరగకుండా ఉండటం కోసమే ఈ వనభోజనాలకు రావడం జరిగిందని తెలియజేశారు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story