గోదావరిలో ఫొటో గ్రాఫర్ల సాహసం..

by  |
గోదావరిలో ఫొటో గ్రాఫర్ల సాహసం..
X

దిశ,మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం‌లోని పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం గోదావరి‌లో పుణ్య స్నానాలకు వచ్చి ప్రమాదవశాత్తు గోదావరిలో నీటమునిగిన ఇద్దరిని సోమవారం స్థానిక ఫోటోగ్రాఫర్లు కాపాడారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలవల్ల ఎగువనున్న ప్రాజెక్టుల గేట్లు ఎత్తడం‌తో గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహించడంతో గోదావరి‌లో అక్కడక్కడ గోతులు ఏర్పడ్డాయి. వరంగల్‌కు చెందిన రమేష్, కార్తీక్ అన్నదమ్ములు ఇద్దరు గోదావరి‌లో దిగి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా గోతిలో పడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. గమనించిన ఫోటోగ్రాఫర్లు వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఆదివారం జరిగిన సంఘటన మరువకముందే సోమవారం కూడా ఇంకో సంఘటన చోటు చేసుకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ప్రమాద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

కాళేశ్వరం‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ప్రత్యేక పూజలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని సోమవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్వామివారిని దర్శించుకొని, పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుబంధ దేవాలయమైన శుభానందాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వామివారి కండువా కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు.



Next Story

Most Viewed