ఉరేసుకుని సౌజన్య ఆత్మహత్య..

6

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్‌లో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న వెదురుపర్తి సౌజన్య (24) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

వివరాల్లోకివెళితే.. ఏలూరులో ఉంటున్న వెదురుపర్తి సౌజన్య అనే యువతి హైదరాబాద్‌లో ఫార్మాసిస్ట్ కంపెనీలో జాబ్ చేస్తోంది. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్‌హోం మీద ఇంటికి వచ్చి ఇక్కడి నుంచే పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సౌజన్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, తన కూతురు మరణానికి ఏలూరుకు చెందిన సింహాద్రి బాలు అనే వ్యక్తి కారణమని.. ప్రేమపేరుతో మోసం చేయడం వల్లే సౌజన్య ఆత్మహత్య చేసుకుందని తండ్రి ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.