ఫైట్ సీన్‌లో హీరోకు గాయాలు.. నిలిచిన ఆరు సినిమాలు

by  |
ఫైట్ సీన్‌లో హీరోకు గాయాలు.. నిలిచిన ఆరు సినిమాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : సినిమా షూటింగ్‌లో అపశృతి జరిగింది. ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా.. పెట్రోల్ బాంబ్ పేలి హీరోతోపాటు మరో నటుడికి గాయాలయ్యాయి. కన్నడ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్న ఓ చిత్రం ఫైట్ సన్నివేశంలో భాగంగా పెట్రోల్ బాంబులు విరిసి పారిపోవాల్సి ఉంది. అయితే హీరో రిషబ్, సహ నటుడు లక్ష్మణ్ పెట్రో బాంబులు వేసి పరుగెత్తే లోపై అవి పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు నటులు గాయపడ్డారు. వారిని చిత్రయూనిట్ వెంటనే ఆస్పత్రికి తరలించింది. కాగా ఈ సినిమా షూటింగ్‌కు అనుమతి తీసుకున్నారా లేదా.. అనుమతి తీసుకుంటే ఎవరు ఇచ్చారు అనే విషయాలపై పోలీసులు విచారిస్తున్నారు.

హీరో రిషబ్ 2013లో లూసియా సినిమాతో హీరోగా శాండిల్ వుడ్‌కు పరిచయం అయ్యారు. ఆయన అంతకు ముందు పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. డైరెక్టర్ గా చేస్తూనే హీరోగా మారి కన్నడ చిత్రసీమలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం రిషబ్ ఆరు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజా ప్రమాదంతో ఆ షూటింగ్‌లు వాయిదా పడే అవకాశం ఉన్నది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed