మాజీ IAS వెంకట్రామిరెడ్డికి షాక్..

by  |
Venkatramireddy1
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిద్దిపేట కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తూ అనూహ్యంగా సోమవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజీనామా లేఖను సీఎస్‌కు అందించగానే క్షణాల్లోనే రాజీనామా ఆమోదం పొందడం, ఆయన టీఆర్ఎస్‌లో చేరడం అంతా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్ రాజీనామాను ఆమోదించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని రీసెర్చ్ స్కాలర్ ఆర్ సుబేందర్ సింగ్, జే శంకర్ వ్యాజ్యం దాఖలు చేశారు.

ఐఏఎస్‌లు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటారని, వెంకట్రామిరెడ్డి నామినేషన్‌ను ఆమోదించకుండా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈసీ, శాసనమండలి కార్యదర్శి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. పిల్‌ను లంచ్ మోషన్ స్వీకరించాలని సీనియర్ న్యాయవాది సత్యంరెడ్డి కోరగా.. అత్యవసర విచారణ చేపట్టేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే, వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయడాన్ని ఖండిస్తూ.. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని తక్షణమే నామినేషన్‌ను తిరస్కరించాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.


Next Story