బ్రేకింగ్.. రాజుది సూసైడ్‌ కాదు.. హైకోర్టులో సంచలన పిటిషన్

190

దిశ, డైనమిక్ బ్యూరో : సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు నిందితుడు రాజు గురువారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రాజు సూసైడ్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజు కుటుంబీకులు పోలీసులే చంపేశారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పౌర హక్కుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం విచారణ జరపనున్నట్లు తెలుస్తోంది.

 

 

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..