మంజీరా మాల్ పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..

178

దిశ, కూకట్​పల్లి : నగరంలోని కేపీహెచ్​బీ పోలీస్​‌స్టేషన్​ పరిధిలో గల కేపీహెచ్​బీ కాలనీ మంజీరా మాల్​ 18వ అంతస్థుపై నుంచి దూకి శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ లక్ష్మీనారాయణ కథనం ప్రకారం.. మంజీరా త్రినిటి కార్పొరేట్​ కార్యాలయంలో గేట్​ నంబర్​ ఒకటి వద్ద ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నట్టు మంజీరా మాల్​ సెక్యూరిటీ సూపర్​ వైజర్​ వాకిటి భూపాల్​ రెడ్డి కంట్రోల్​ రూంనకు సమాచారం ఇచ్చాడు.

వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న కేపీహెచ్​బీ పోలీసులు వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి సోమర భూపతి రెడ్డి (25)గా గుర్తించారు. మృతుడు 18వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించినట్టు సీఐ తెలిపారు. మృతుడు భూపతి రెడ్డి 17వ అంతస్థులో గల ఎంఎస్​సీ సర్వీస్​ సెంటర్​లో పని చేస్తున్న ఓ వ్యక్తిని కలవడానికి వచ్చినట్టు తెలిసిందని సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. అయితే, ఆ యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. ప్రాథమికంగా లభించిన వివరాల ఆధారంగా మృతుడి పేరు మాత్రమే కనుగొన్నట్టు పోలీసులు తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..