రొటోవేటర్‌లో పడి వ్యక్తి మృతి

by  |
రొటోవేటర్‌లో పడి వ్యక్తి మృతి
X

దిశ, నర్సంపేట: ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైన ఘటన నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఉసిల్ల బయన్న (48) అనే రైతు వ్యవసాయ పనుల్లో భాగంగా డ్రైవర్‌తో కల్టీవేటర్ కొట్టిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్‌ను డ్రైవర్ వేణు వేగంగా నడపడంతో బయన్న ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుండి రొటవేటర్ మీద పడ్డాడు. ఈ ఘటనలో బయ్యన్నకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఉసిల్ల బయన్నకు ముగ్గురు కూతుర్లు, ఓ కుమారుడు ఉన్నారు.

Next Story

Most Viewed