శ్మశాన నిర్మాణాలపై ఉన్న ఇంట్రెస్ట్.. మా బ్రతుకుల మీద లేదా మంత్రి గారు..

by  |
శ్మశాన నిర్మాణాలపై ఉన్న ఇంట్రెస్ట్.. మా బ్రతుకుల మీద లేదా మంత్రి గారు..
X

దిశ, ముథోల్ : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వైకుంఠ ధామాలను ప్రారంభించడానికి వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇళ్లు లేని బాధితులు శ్మశాన వాటికల నిర్మణాలపై పెట్టిన ఇంట్రెస్ట్.. ఇండ్లు లేని మా లాంటి వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించడంపై పెట్టండి అంటూ ప్రజలు నిలదీశారు. పట్టణంలోని బురుడుగల్లిలో కుబీర్ రోడ్డు విస్తీర్ణంలో కొన్ని సంవత్సరాల క్రితం ఇల్లు కోల్పోపోయిన తమను ఇప్పటి వరకు పట్టించుకోవడంలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలో మంత్రిని తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడు నిర్మించి ఇస్తారని అడగడంతో.. మీ ఎమ్మెల్యేకు అడగండి అంటూ సమాధానం ఇచ్చారు. తమకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని నాయకులు కాలం గడుపుతున్నారు.. తప్ప ఇప్పటి వరకు నిర్మాణాలు చేపట్టలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్టకాలంలో నిలువ గూడులేక గుడిసెలు వేసుకుంటే.. గాలివానకు అవి కొట్టుకుపోయినట్టు బాధితులు వాపోయారు.

కరోనా కష్టకాలంలో బతకడమే కష్టమవుతుంటే.. అద్దె ఇళ్లలో ఉండటానికి డబ్బు కట్టడం ఇబ్బందిగా ఉందన్నారు. ఇప్పటికైనా మంత్రి, ఎమ్మెల్యే తమ బాధను అర్ధం చేసుకుని తమ సమస్యలను తీర్చాలని కోరారు. చనిపోయిన వారికి ఇచ్చిన విలువ.. బ్రతికున్న వాళ్లకు, తమ ఇళ్లకు ఇవ్వడం లేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేసారు.

Next Story

Most Viewed