సండే స్పెషల్.. మాకు ‘కరోనా’ రాదు.. గుంపులుగా జనం

by  |
సండే స్పెషల్.. మాకు ‘కరోనా’ రాదు.. గుంపులుగా జనం
X

దిశ, కుత్బుల్లాపూర్ : కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మాస్కులు ధరించడం మనందరి బాధ్యత. భౌతిక దూరమే మనకు శ్రీరామరక్ష అంటూ ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంధ సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కానీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. షాపూర్ నగర్ మార్కెట్‌లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు వేల సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.

మాంసం దుకాణాలు, చేపల మార్కెట్, మద్యం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఏ ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడంలేదు అనడానికి ఈ ఫోటోలే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆదివారం కరోనా నిబంధనలు పాటించకుండా మార్కెట్ల వద్ద ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు. దీంలో కరోనా వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed