ఈ రద్దీతో కరోనా వైరస్ రాదా…!

by  |
ఈ రద్దీతో కరోనా వైరస్ రాదా…!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్రంలో లాక్ డౌన్ లో భాగంగా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉదయం 6.గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా నిత్యవసర వస్తువులకోసం రోడ్డెక్కుతున్నారు. రంగా రెడ్డి జిల్లాలో ప్రజలు నిత్యవసర వస్తువులకోసం రోడ్లపై బారులు తీరారు. సామాజిక దూరం, మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఈ లాక్ డౌన్ తో ఎలాంటి ప్రయోజనం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దంతా ఇంట్లో ఉన్న ఉదయం బయటికి వెళ్లి వైరస్ అంటించుకోవడం ఖాయంగా కనిపిస్తుందంటున్నారు.

కూరగాయల మార్కెట్, చికెన్ మార్కెట్ లవద్ద గుంపులు గుంపులుగా ఉండే జనాలను చూసి కొంత మంది ఏమీ కొనుగోలు చేయకుండానే వెళ్లిపోతున్నారు. ఈ జనాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో వైరస్ పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్‌తో ఎక్కడి వాహనాలు అక్కడే గంటల కొద్దీ నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీస్లు వాహనాలు సాఫిగా పోయేందుకు చర్యలు తీసుకున్న సంఘటనలు కనిపించలేదు. ఉదయం 6 నుంచి 10గంటల వరకు కొవిడ్ నిబంధనలు పాటించేందుకు ప్రణాళిక చేసి అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Next Story

Most Viewed