- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మంచినీళ్లెక్కడ.. వైసీపీ ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్‌రావుకు చేదు అనుభవం ఎదురైంది. మీ కోసం.. మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం అచ్చంపేట మండలం కొండూరులో పర్యటిస్తుండగా గ్రామస్తులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మంచి నీరు, పారిశుద్ధ్యంపై గ్రామస్తులు నిలదీశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అసలు పనులు చేయడం లేదని, అడిగినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. కొండూరులోని సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్లిపోయారు.
- Tags
- mla
Next Story