అందరూ అప్రమత్తంగా ఉండండి : సీఎం కేసీఆర్

by  |
CM KCR
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారీ వర్షాల కారణంగా ఎస్సారెస్పీ ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. గురువారం ట్విట్టర్ వేదికగా ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్నందున ఎస్‌ఆర్‌ఎస్‌పీకి వరద పెరిగే అవకాశం ఉందని, దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.

గోదావరి, కృష్ణ నదీ పరివాహక ప్రాంతాల్లో రాష్ట్రంతోపాటు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున.. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తే అవకాశం ఉందని తెలిపారు. నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు బయటకు రావద్దని ఇళ్లలోనే ఉండడమే క్షేమమని సీఎం కోరారు. రానున్న రెండు రోజుల్లో ఎంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలని పిలుపునిచ్చారు.



Next Story

Most Viewed