ఎవరూ బయటకు రావొద్దు

by  |
ఎవరూ బయటకు రావొద్దు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా నియంత్రణ చర్యలు పాటించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.ఎవరూ ఇంటి నుంచి బయటికి రావొద్దని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం పాటించాలని కోరారు.కరోనాపై సీఎం కేసీఆర్ అధికారులను అలెర్ట్ చేయడంతో అధికారులు బాగా పని చేస్తున్నారని కొనియాడారు. వైద్యులు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నారని వివరించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు స్వీయ నియంత్రణ ఒక్కటే మార్గమని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Tags : dont come out side, mla jagga reddy, corona, lockdown, mla praises cm kcr, to control corona

Next Story

Most Viewed