డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు షాక్.. ఇండ్లు ఇవ్వాలంటూ..

by  |
డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు షాక్.. ఇండ్లు ఇవ్వాలంటూ..
X

దిశ, సికింద్రాబాద్: తమకు డబుల్ బెడ్‌ రూం ఇండ్లు కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మారావు కార్యాలయాన్ని వందలాది మంది బాధితులు ముట్టడించారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేత దీపక్ జాన్ నేతృత్వంలో దాదాపు 300 మంది పద్మారావు ఆఫీసు ఎదుట భైఠాయించారు. ఆరేండ్ల క్రితం డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏంటని నిలదీశారు. వెంటనే ప్రభుత్వం లబ్ధిదారులకు ఇండ్లతో పాటు, స్థలం ఉన్న వారికి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed