పాల ప్యాకెట్లతోనే సరిపెట్టుకుంటున్నారు..!

by  |
పాల ప్యాకెట్లతోనే సరిపెట్టుకుంటున్నారు..!
X

దిశ, రంగారెడ్డి: నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) కట్టడికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తోంది. కొవిడ్ కేసుల ఆధారంగా జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా డివైడ్ చేశారు. రెడ్ జోన్ పరిధిలోని ప్రజలు ఇంటి నుంచి బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులు ప్రభుత్వం అందిస్తోంది. అయితే, రెడ్ జోన్ పరిధిలో కొన్ని సడలింపులు ఇచ్చినా ప్రజల్లో ఆందోళన తగ్గటం లేదు. ఉదయం ఆ ప్రాంతంలో పాల ప్యాకెట్ తప్ప కూరగాయలు, నిత్యావసర వస్తువుల దొరకడం లేదని పలువురు అంటున్నారు. పాలప్యాకెట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అసలెవరూ షాపులు తీయడం లేదనీ, ప్రజలూ బయటకు రావడం లేదని తెలుస్తోంది.

తెరుచుకోని షాపులు..

సరూర్‌నగర్‌లో ఉండే ఒక వృద్ధుడు పెద్ద కొడుకు సూర్యాపేటలో పల్లీలు కొనుగోలు చేశాడు. ఆ పల్లీలు సరూర్‌నగర్‌లో నూనెగా ఆడించి మలక్‌పేట్‌లోని గంజిలో విక్రయించారు. అయితే, పల్లీలతో నూనె తయారీ చేసే వ్యక్తికి సూర్యాపేటలోనే కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆ వ్యక్తి వనస్థలిపురంలో ఉండే బంధువులను కలవడంతో మరింత కలవరం మొదలైంది. వనస్థలిపురం‌లోని వ్యక్తి కిరాణం షాపు నుంచి కొంత మందికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఈ విషయం తెరపైకి రావడంతో కస్టమర్లు కిరాణం వెళ్లేందుకు భయపడుతున్నారు. కిరాణ షాపులూ తెరవడం లేదు. ఈ పరిస్థితి ఎల్బీనగర్, వనస్థలిపురం, భాగ్యాలత, ఎన్జీఓ కాలనీ, సాహెబ్ నగర్, బీఎన్ రెడ్డిలలో ఉంది. ఈ ప్రాంతాలన్ని అష్టదిగ్బంధంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలోని ప్రజలకు నిత్యావసర వస్తువులు అందడం లేదు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. రెడ్ జోన్‌లో సైతం రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చింది. కానీ, అవేవి కనిపించడం లేదు. వైన్ షాపులు మాత్రం ఖాకీల బందోబస్తుతో మంచిగా నడుస్తున్నాయి.

కూరగాయలు దొరకడం లేదు..

వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ వచ్చిందని కిరణం షాపులు తీయడం లేదు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు ఇబ్బంది కలుగుతుంది. ఉదయం పాల వాహనం దగ్గర పాలు కొనుకుంటున్నాము. కానీ, కూరగాయలు దొరకడం లేదు. హయత్ నగర్, రైతుబజార్ ఎక్కడికి పోయున దొరకడం లేదు. ప్రభుత్వం
ఆదుకోవాలి.-వెంకటమ్మ, ద్వారాకమైనగర్

ఉద్యోగాలు పోతున్నయ్..

రోజూ పని చేసుకుంటే కానీ, పూట గడవని పరిస్థితి మాది. ఇలాంటి పరిస్థితుల్లో నా భర్త ఉద్యోగానికి వెళ్తున్నారు. ఉద్యోగం చేయకపోతే వేతనం రాదు. వేతనం రాకపోతే బతుకుడు ఎట్ల? ప్రయివేటు ఉద్యోగానికి గ్యారంటీ లేదు. అయితే, కరోనా తెచ్చిన భయంతో ఉద్యోగాలు పోయేటట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీల్లో ఉద్యోగులను తీసేసిళ్లు.- అరుణ, వనస్థలిపురం.

Tags: covid 19 effect, lock down, people, fear, small merchant, shops, not opening, red zone, relaxations



Next Story

Most Viewed