భీమ్లా నాయక్‌కు ఊహించని గిఫ్ట్.. ఆ దర్శకుడు ఏమన్నాడంటే..!

by  |
భీమ్లా నాయక్‌కు ఊహించని గిఫ్ట్.. ఆ దర్శకుడు ఏమన్నాడంటే..!
X

దిశ, సినిమా : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్‌కు దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహాకవి ‘శ్రీశ్రీ మహాప్రస్థానం’ పుస్తకాన్ని బహుమతిగా అందించారు. శ్రీశ్రీ మహాప్రస్థానంపై రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని ‘భీమ్లా నాయక్’ సెట్‌లో పవన్‌కు అందించిన త్రివిక్రమ్‌ అనంతరం మాట్లాడుతూ.. శ్రీ శ్రీ ఒక శిఖరంలాంటి వారని, ఆయన ముందు తనలాంటి వాళ్లందరూ గులకరాళ్లంటూ వ్యాఖ్యానించారు. అలాగే పవన్, త్రివిక్రమ్ సినిమా మిత్రులే కాకుండా సాహిత్య మిత్రులు కావడంతో తరుచూ పలువురు సాహితీవేత్తలు, వాళ్ల రచనలను గుర్తుచేసుకుంటూ ఆనందిస్తుంటారు. ఈ సందర్భంగా ఒక కవి మరో కవి గురించి చెబుతుంటే వచ్చే సొబగు బాగుందని పవన్ కల్యాణ్ అనడంతో నవ్వులు పూశాయి. అలాగే వారిద్దరూ శ్రీశ్రీ కవితలను, సాహిత్యాన్ని గుర్తుచేసుకొని మురిసిపోయారు.



Next Story