అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఏపీ : పవన్ కల్యాణ్

by  |
Pawan Kalyan
X

దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై, నేతల ఇంటిపై దాడిని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖండించారు. జనసేన పార్టీ ఐటీ వింగ్ సమావేశంలో ఉన్న పవన్ కల్యాణ్ ఈ దాడుల విషయం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి సంస్కృతి సరికాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులకు జనసేన పార్టీ తీవ్ర వ్యతిరేకమన్నారు. విజయవాడ, మంగళగిరిలోని టీడీపీ కార్యాలయాలపైనా.. విశాఖ, ప్రొద్దుటూరులో టీడీపీనేతలు, పట్టాభి ఇంటిపై దాడి సరికాదన్నారు. వ్యక్తిగత దాడులు, నాయకులు, పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి క్షేమకరం కాదన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా దారుణమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ పోలీసులు కేంద్ర హోంశాఖ ఈ దాడులపై దృష్టి సారించాలన్నారు. లేని పక్షంలో అరాచకాలకు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారే ప్రమాదం ఉందన్నారు. ఈ దాడులు వైసీపీ శ్రేణులు పనేనని సమాచారం అందుతుందన్నారు. ఇలాంటి సంస్కృతి సరికాదని వైసీపీకి సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ప్రజల పక్షాన జనసేన పోరాటం చేస్తుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed