పవన్ జోడు గుర్రాల సవారీ..

by  |
పవన్ జోడు గుర్రాల సవారీ..
X

దిశ, వెబ్‌డెస్క్ :
‘జనసేనాని.. పవర్ స్టార్’.. ఒకటి రాజకీయ ప్రయాణమైతే, మరొకటి సినీ ప్రయాణం. మరి పవన్.. జనానికి అండగా నిలుస్తూ జనసేనాని బిరుదుకు సార్థకత చేకూరుస్తాడా? అదే టైమ్‌లో పవర్ స్టార్‌గా అభిమానులను ఎంటర్‌టైన్ చేయగలడా? అనేది ఒక ప్రశ్న. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాలను వదిలేసిన పవన్.. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాడు కాబట్టి, మరి రాజకీయాలకు దూరంగా ఉంటాడా? అనే ప్రశ్నలు కూడా సామాన్యుల నుంచి తలెత్తుతున్నాయి. పవర్ స్టార్ ఫ్యాన్స్, జనసేనాని ఫాలోవర్స్ మాత్రం ‘మా అభిమాన హీరో, మా అధినాయకుడు జోడు గుర్రాల సవారీ చేయగలడు.. చేసి చూపించగలడు’ అని బల్లగుద్ది మరీ చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే నిజమేనేమో అనిపిస్తోంది.

వకీల్ సాబ్‌తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న పవర్‌స్టార్.. బుధవారం నుంచి షూటింగ్‌తో బిజీ అయిపోయాడు. అయితే షూటింగ్ టైమ్‌లో పవర్ స్టార్ అయిపోతున్న పవన్.. షూటింగ్ గ్యాప్‌లో జనసేనాని అయిపోతున్నాడు. అటు సినిమా.. ఇటు జనసేనాని బాధ్యతలు రెండూ నిర్వర్తిస్తున్నాడు. బుధవారం షూటింగ్ స్పాట్ నుంచి రిలీజైన పవన్ స్మార్ట్ లుక్స్ ఎంత వైరల్ అయ్యాయో.. జనసేనానిగా ఫైల్స్ మీద సంతకం చేస్తున్న పిక్స్ కూడా అంతే వైరల్ అయ్యాయి.

ఇక సెకండ్ డే షూటింగ్ మియాపూర్‌‌లో ఉండగా.. అక్కడికి చేరుకునేందుకు మెట్రోలో ప్రయాణం చేశారు పవన్. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్‌లో చెకింగ్ ప్రక్రియ, ఎంట్రీ విధానాన్ని పాటించారు. పవర్ స్టార్‌గా జర్నీ స్టార్ట్ చేసిన పవన్.. ప్రయాణం మధ్యలో జనసేనానిగా మారిపోయారు. ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల రైతులతో మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. పవన్ పలకరింపుతో పులకరించిపోయిన రైతులు.. జనసేనానిని కలవడం సంతోషంగా ఉందన్నారు. మెట్రో ప్రయాణం తమకు ఫస్ట్ టైమ్‌ అన్న రైతులతో నవ్వుతూ భుజం తట్టి.. తనకు కూడా మొదటిసారే అని తెలిపి జాగ్రత్తగా ఉండమని సూచించారు.

అన్నయ్య చిరు గారు.. మీ తమ్ముడు మీ కోరిక ఎప్పుడు కాదన్నారు చెప్పండి! జోడు గుర్రాల సవారీ మొదలెట్టాడు. ఇక ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాడు చూడండి అంటున్న ఫ్యాన్స్.. ఒకేసారి ఇన్ని స్టైలిష్ పిక్స్ చూసి ఆనందంతో పోయేలా ఉన్నామంటున్నారు.

Next Story