13 శాతం పడిపోయిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు: సియామ్

64
passenger vehicles

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు డిసెంబర్‌లో 13 శాతం క్షీణించి 2,19,421 యూనిట్లకు చేరుకున్నాయని పరిశ్రమల సంఘం సియామ్ శుక్రవారం తెలిపింది. 2020, డిసెంబర్‌లో ఈ విభాగంలో మొత్తం 2,52,998 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యూఫాక్చరర్స్(సియామ్) తాజా గణాంకాల ప్రకారం.. ద్విచక్రవాహనాలు 2020లో మొత్తం 11,27,917 యూనిట్లు అమ్ముడుపోగా, గతేడాది డిసెంబర్‌లో 11 శాతం తగ్గి రూ. 10,06,062 యూనిట్లకు పడిపోయాయి.

ఇందులో మోటార్‌సైకిళ్ల అమ్మకాలు 2 శాతం పడిపోయి 7,26,587 యూనిట్లు, స్కూటర్ అమ్మకాలు 24 శాతం దెబ్బతిని 2,46,080 యూనిట్లకు చేరుకున్నాయి. త్రైమాసిక పరంగా అక్టోబర్-డిసెంబర్ మధ్య ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 15 శాతం పడిపోయి 7,61,124 యూనిట్లకు చేరుకున్నాయి టూ-వీలర్ విభాగంలో 25 శాతం తగ్గి 35,98,299 యూనిట్లుగా నమోదయ్యాయి. అయితే, కమర్షియల్ వాహనాల విభాగంలో అమ్మకాలు స్వల్పంగా పెరిగి 1,94,712 యూనిట్లు అమ్ముడుపోయాయి. త్రైమాసిక పరంగా 22 శాతం క్షీణించి 46,36,549 యూనిట్లు విక్రయించబడ్డాయి.