నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

by  |
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం 2020-21 ఆర్థిక సర్వేను మంత్రి సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో కాగిత రహిత బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ ప్రతులను ఆన్‌లైన్‌లో పెట్టనుంది కేంద్రం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను రెండు విడతలుగా జరపనున్నారు. తొలి విడతలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 15 వరకు, మలి విడతలు మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు కొనసాగనున్నాయి.


Next Story

Most Viewed