విషాదం.. కొడుకు మృతి తట్టుకోలేక తల్లిదండ్రులు..

by  |
విషాదం.. కొడుకు మృతి తట్టుకోలేక తల్లిదండ్రులు..
X

దిశ, జవహర్ నగర్ : కరోనాతో కుమారుడు మృతి చెందిన వార్త తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటన నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడలో సోమవారం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు చనిపోవడంతో అందరూ శోకసంద్రంలో మునిగిపోయారు. ఆదివారం సాయంత్రం కన్న కొడుకు కరోనాతో చనిపోగా సోమవారం ఉదయం గుండెపోటుతో తల్లితండ్రులు మృతి చెందడం అందరినీ కలిచివేసింది.

వివరాల్లోకి వెళితే.. వంపుగూడకు చెందిన పిసరి హరీష్ రెడ్డి( 31)కి 25 రోజుల క్రితం కరోనా సోకింది. కరోనా బారిన పడిన హరీష్.. చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచాడు. దీంతో కుమారుడు మృతి చెంది.. 24 గంటలు గడవకముందే హరీష్ రెడ్డి తల్లిదండ్రులు గుండెపోటుతో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story

Most Viewed