పెళ్లిళ్ల కోసం బిగ్ బాస్‌ నిర్వహిస్తున్నారా..?

by  |
bigboss
X

దిశ, సినిమా : రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తమ పెళ్లి బంధాన్ని కాపాడుతుందని భావిస్తున్నట్లుగా నటుడు పంకిత్ వెల్లడించాడు. 2000 సంవత్సరం సెప్టెంబర్‌లో ప్రాచీని మ్యారేజ్ చేసుకున్న పంకిత్.. 2015 వరకు కలిసే ఉన్నామని, ఆ తర్వాతి నుంచే వేరువేరుగా ఉంటున్నామని వివరించాడు. ఎంత మంది కౌన్సిలర్స్‌ను సంప్రదించినా పాజిటివ్ రిజల్ట్ రాలేదన్న నటుడు.. తామిద్దరికీ ఒకరంటే ఒకరికి గౌరవం మాత్రం ఉందని, తమ కొడుకు భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నామని తెలిపాడు.

ఈ క్రమంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న సీరియల్ స్టార్స్ రుబీనా, అనుభవ్ తమ మ్యారేజ్‌ రిలేషన్‌‌షిప్‌ను సేవ్ చేసుకోవడం చూసి.. తను కూడా ఇదే ఫాలో అయితే బాగుంటుందని అనుకుంటున్నట్లు చెప్పాడు పంకిత్. షోలో పార్టిసిపేట్ చేసేందుకు ప్రాచీకి కూడా ఎలాంటి అబ్జెక్షన్ లేదని.. ఒకవేళ ఇది కూడా వర్కౌట్ కాకపోతే మ్యూచువల్‌గా డైవోర్స్‌కు అప్లై చేస్తామని వివరించాడు.

Next Story