ఆమెపై కక్షగట్టిన పంచాయతీ పెద్దలు..

by  |
ఆమెపై కక్షగట్టిన పంచాయతీ పెద్దలు..
X

దిశ, మెదక్: పారిశుద్ధ్య కార్మికురాలిపై పంచాయతీ పెద్దలు కక్ష పెంచుకున్నారు. పనిలోకి రానివ్వడమే కాకుండా.. ఇదివరకు చేసిన పనికి చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదు. దీంతో ఎం చేయాలో తెలియక కుటుంబ సభ్యులతో కలిసి పురుగుల మందు డబ్బా చేతబట్టుకుని పంచాయతీ కార్యాలయం ఎదుట ఆమె ఆందోళనకు దిగింది.

వివరాల్లోకివెళితే.. మెదక్ మండలం మాచవరం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మీ గత 15ఏళ్లుగా అదే గ్రామంలో నెలకు రూ. 900 జీతానికి సఫాయి కార్మికురాలిగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఆమెకు నెలకు రూ.4500 ఇస్తున్నారు. అయితే, గత 9 నెలలగా ఆమెకు జీతం ఇవ్వడం లేదు. అదీగాక పనిలోకి రావద్దంటూ గ్రామ పంచాయతీ సభ్యులు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపిస్తోంది.

పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, కొందరు వార్డు సభ్యులు కావాలనే తనను పనిలో నుంచి తొలగించాలని చూస్తున్నారని రాజ్యలక్ష్మీ కన్నీటి పర్యంతమైంది.తనను తిరిగి పనిలోకి తీసుకోకపోతే పురుగుల మందు తాగి తమ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని రాజ్యలక్ష్మి వాపోయింది.



Next Story

Most Viewed