సీఎంకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక లేఖ

by  |
సీఎంకు పల్లా రాజేశ్వర్ రెడ్డి కీలక లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విలేజ్​ రెవెన్యూ ఆఫీసర్ల పోస్టు రద్దయినందున వారిని స్పెషల్​రెవెన్యూ ఇన్​స్పెక్టర్లుగా, జూనియర్ ​అసిస్టెంట్లుగా నియమించాలని, అలాగే రెవెన్యూ శాఖలోనూ కొనసాగించాలని సీఎం కేసీఆర్​కు రైతు సమన్వయ సమితి చైర్మన్​ డా.పల్లా రాజేశ్వర్​రెడ్డి లేఖ రాశారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తుండగా అనేక విజ్ఞప్తులు వచ్చాయని, అలాగే తెలంగాణ వీఆర్ఓల సంఘం కూడా వినతి పత్రం సమర్పించినట్లు లేఖలో పేర్కొన్నారు. తాము తెలంగాణలో ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని, ధరణి రిజిస్ట్రేషన్లను, కరోనా విధులను నిర్వహించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు.

గతేడాది సెప్టెంబరు 9న వీఆర్ఓల పోస్టులను రద్దు చేశారు. ఐతే రెవెన్యూ శాఖలోనే ఏడెనిమిదేండ్లుగా పని చేశారని, వారందరూ జూనియర్​ అసిస్టెంట్​ స్కేలుతో ఉద్యోగం చేసినట్లు తెలిపారు. పీఆర్సీలో తమకు సీనియర్ అసిస్టెంట్​ స్కేలును వర్తింపజేయాలని కోరుతున్నారని, వీఆర్ఓలందరినీ రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని వేడుకుంటున్నట్లు వివరించారు. 50 ఏండ్లు నిండిన వీఆర్ఓలకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు అవకాశం ఇవ్వాలని, సస్పెన్షన్కు గురైన వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని సూచించారు. అర్హులైన వీఆర్ఓలకు స్పెషల్​గ్రేడ్ ​స్కేలును వర్తింపజేయాలని సీఎంకు రాసిన లేఖలో చెప్పారు. రెండేండ్లు పూర్తి చేసిన వారికి ప్రొబేషన్ డిక్లేర్ ​చేయాలన్నారు. ఈ మేరకు వీఆర్ఓల సంఘం తనకు వినతి పత్రాలు సమర్పించిందన్నారు. వారి సమస్యలను పరిష్కరించాలని లేఖలో సీఎంను కోరారు.

GHMC అధికారికి తుపాకీ గురి.. తప్పు ఎవరిదీ?

Next Story

Most Viewed