ఆలియా కాదు.. జాన్వీ కపూర్‌ను లైన్‌లో పెడుతున్న పాకిస్థాని

by  |
ఆలియా కాదు.. జాన్వీ కపూర్‌ను లైన్‌లో పెడుతున్న పాకిస్థాని
X

దిశ, సినిమా : పాకిస్థాని ర్యాపర్‌, కమెడియన్ మహమ్మద్ షా.. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్‌పై ర్యాప్ సాంగ్ క్రియేట్ చేశాడు. తనను ఇంప్రెస్ చేసే క్రమంలో ఈ సాంగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ‘గల్లీ బాయ్’ స్టైల్‌లో ఆలియా సినిమా పేర్లను యూజ్ చేస్తూ క్యాచీ లిరిక్స్‌తో మహమ్మద్ షా ర్యాప్ అదరగొట్టేయగా, ఈ వీడియోలో ‘రాజి, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హైవే, 2 స్టేట్స్’ మూవీస్ క్లిపింగ్స్ వినియోగించాడు. అయితే ఈ స్టన్నింగ్ బ్యూటీకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని లేట్‌గా రియలైజ్ అయిన షా.. ఇక తన అటెన్షన్‌ను జాన్వీ కపూర్ వైపు మళ్లిస్తే రిజల్ట్ ఉంటుందేమోనని నిర్ణయించుకున్నాడు. ఈ వీడియోపై స్పందించిన ఆలియా.. ‘చాలా హార్డ్‌’గా ఉందని రిప్లై ఇచ్చింది. దీనికి సంతోషపడిపోయిన షా.. ‘ఆలియా ఐ లవ్ యూ’ అంటూ మురిసిపోయాడు.

Next Story

Most Viewed