ముంబయి పేలుళ్ల నిందితుడు లఖ్వీకి జైలు

by  |
ముంబయి పేలుళ్ల నిందితుడు లఖ్వీకి జైలు
X

ఇస్లామాబాద్: ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ కోర్టులు శిక్షలు విధిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తాయిబా ఆపరేషన్స్ కమాండర్ జాకి ఉర్ రెహమన్ లఖ్వీకి పాకిస్తాన్ కోర్టు 15 ఏండ్ల జైలు శిక్షను శుక్రవారం విధించింది. 2008, ముంబయి పేలుళ్ల వెనుక లఖ్వీ.. అతని ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని భారత్ సహా అమెరికా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మూడు వేర్వేరు కేసుల్లో ఐదేండ్ల చొప్పున కలిపి 15ఏండ్ల జైలు శిక్ష విధించారు. కానీ, శిక్షను ఒకేసారి అమలు చేయనుండటంతో శిక్షాకాలం ఐదేండ్లలోనే ముగియనున్నది. కేసు లక్ష చొప్పున రూ.3లక్షల జరిమానా కూడా విధించింది.

Next Story

Most Viewed