ఇదే ఊపుతో ఫైనల్స్‌కు వెళ్తాం.. ప్రత్యర్థులకు షాహీన్ అఫ్రిది సవాల్

by  |

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ విజయంలో ఓపెనర్లు బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్‌ల బ్యాటింగ్‌ తీరుపై అనేక ప్రశంసలు వస్తున్నాయి. అంతేకాకుండా యువ బౌలర్ షాహీన్ అఫ్రిది పేరు కూడా ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగుతోంది. టీమిండియాలో హిట్‌మ్యాన్‌ను డకౌట్ చేసిన ఇతగాడు ఆ తర్వాత క్లాసిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్‌ను సైతం మట్టికరిపించాడు. ఆ తర్వాత హాఫ్ సెంచరీతో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీని క్యాచ్ అవుట్ రూపంలో పెవిలియన్ పంపాడు. టీమిండియాలో కీలక వికెట్లు అఫ్రిది ఒక్కడే తీసుకోవడం విశేషం. 4 ఓవర్లలో 31 పరుగులకు 3 వికెట్లు తీసుకుని టీ 20లో మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఈ సందర్భంగా షాహీన్ మాట్లాడుతూ.. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నా తల్లిదండ్రులు, పాకిస్థానీయులందరికీ అంకితం.. మ్యాచ్‌లో విజయం సాధించినందుకు శుభాకాంక్షలు.. మేము ఈ ఊపును కొనసాగించి ఫైనల్స్‌కు వెళ్తాము’ అంటూ ధీమా వ్యక్తం చేశాడు.

FOLLOW US ON ► Facebook , Google News , Twitter , Koo , ShareChat , Telegram , Disha TV

Next Story