చంద్రుడిపై 800 కోట్ల మందికి సరిపడా ఆక్సిజన్

by  |
moon
X

దిశ, ఫీచర్స్ : అంతరిక్షంలో ఇతర గ్రహాలపై మనుషుల ఆవాసానికి సంబంధించి పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మానవానుకూల పరిస్థితులతో పాటు గాలి, నీటి లభ్యతపై చాలా ఏళ్లుగా అన్వేషణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజా అధ్యయనం నమ్మశక్యం కాని విషయాలను వెల్లడించింది. భూమి మీదున్న జనాభా అంతటికీ చంద్రుడి ఉపరితలం 1,00,000 ఏళ్లపాటు ఆక్సిజన్ అందించగలదని తెలిపింది. చంద్రుడి ఉపరితలం 45 శాతం ప్రాణవాయువును కలిగి ఉన్న రెగోలిత్(చంద్రుని ఉపరితలాన్ని కప్పి ఉంచే రాతి, ధూళి పొర)తో కప్పబడి ఉందని పేర్కొంది.

చంద్రుడి రెగోలిత్.. సగటున ఒక క్యూబిక్ మీటర్‌కు 630 కిలోల ఆక్సిజన్‌తో పాటు 1.4 టన్నుల మినరల్స్‌ను క్యారీ చేస్తుంది. మనుషులకు రోజుకు 800 గ్రాముల ఆక్సిజన్ అవసరముండగా.. ఒక వ్యక్తి రెండేళ్లపాటు జీవించేందుకు 630 కిలోలు సరిపోతుంది. ఇక చంద్రునిపై రెగోలిత్ సగటులోతు సుమారు 10 మీటర్లు ఉన్నట్లయితే, దాని నుంచి ఆక్సిజన్ మొత్తం సంగ్రహించబడుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే.. ఈ లెక్కన 10 మీటర్ల వరకు గల చంద్రుని ఉపరితలం సుమారు 1,00,000 సంవత్సరాల పాటు భూమి మీదున్న 8 బిలియన్ల ప్రజలకు తగినంత ఆక్సిజన్‌ అందించగలదు. అయితే ఆక్సిజన్‌ను మనం ఎంత ప్రభావవంతంగా సంగ్రహించగలం? ఉపయోగించగలం? అనే అంశాలపైనా ఇది ఆధారపడి ఉంటుంది.

చంద్రుడిపై జీవ వాతావరణ పరిస్థితులు ఉన్నా.. ఎక్కువగా హైడ్రోజన్, నియాన్, ఆర్గాన్‌లతో కూడి ఉంటుంది. ఇది మానవుల వంటి ఆక్సిజన్‌పై ఆధారపడి జీవించే క్షీరదాల మనుగడకు కష్టం. నిజానికి చంద్రునిపై ఆక్సిజన్ పుష్కలంగా ఉంది కానీ వాయు రూపంలో లేదు. ఇది రెగోలిత్ లోపల చిక్కుకుంది.



Next Story

Most Viewed