‘ఆర్థిక వ్యవస్థపై సెకెండ్ వేవ్ ప్రభావం తక్కువే’

by  |
‘ఆర్థిక వ్యవస్థపై సెకెండ్ వేవ్ ప్రభావం తక్కువే’
X

దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి గణాంకాలు విడుదల నేపథ్యంలో దేశ ఆర్థికవ్యవస్థపై సెకెండ్ వేవ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు కె వి సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. అయితే, కరోనా కారణంగా ఏర్పడే అనిశ్చితి ఉందని ఆయన అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఉత్పన్నమయ్యే పరిస్థితులను బట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ రెండంకెల వృద్ధిని సాధిస్తుందో లేదో అంచనా వేయడం కష్టమని సుబ్రమణియన్ తెలిపారు.

అయినప్పటికీ సెకెండ్ వేవ్ ప్రభావం ఆర్థికవ్యవస్థపై అంత పెద్దగా ఉండదని సుబ్రమణియన్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆర్థికవ్యవస్థకు ఆర్థిక, ద్రవ్య మద్దతు ముఖ్యమని స్పష్టం చేశారు. అలాగే, దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపినీ వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, ఇది కరోనాను తగ్గించడంలో సహాయపడుతుందన్నారు. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం ఆహార ధాన్యాల ఉత్పత్తి రికార్డు స్థాయిలో ఉంటుందని సుబ్రమణియన్ వెల్లడించారు.



Next Story

Most Viewed