ఎన్ఎస్ఈలో చేరిన 50 లక్షల మంది కొత్త ఇన్వెస్టర్లు!

by  |
nsc15082021
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా పెట్టుబడుల పట్ల అవగాహన పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు 50 లక్షల మంది కొత్త పెట్టుబడిదారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఎన్ఎస్ఈ సీఈఓ విక్రమ్ లిమాయే చెప్పారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం 80 లక్షల కొత్త పెట్టుబడిదారుల్లో 62.5 శాతానికి సమానమని ఆయన తెలిపారు. చిన్న సంస్థలు, రిటైల్ పెట్టుబడిదారులకు మద్దతివ్వడంలో ఎన్ఎస్ఈ చొరవ కారణంగా గత కొన్నేళ్లలో ప్రత్యక్ష రిటైల్ భాగస్వామ్యం గణనీయంగా పెరిగినట్టు ఆయన పేర్కొన్నారు.

ఈ పెరుగుదల మొత్తం మార్కెట్ టర్నోవర్‌లో వ్యక్తిగత పెట్టుబడిదారుల వాటా పెంపునకు సాయపడింది. ‘600కి పైగా నగరాల్ళో విస్తృతమైన పెట్టుబడిదారుల కార్యక్రమం ద్వారా రిటైల్ భాగస్వామ్యం మెరుగుపడేందుకు వీలైంది. ఈక్విటీ మార్కెట్లలో ఈ నిరంతర పెరుగుదలతో గత రెండేళ్లలో 1.70 కోట్ల ఇన్వెస్టర్ల రిజిస్ట్రేషన్లు నమోదైనట్టు’ విక్రమ్ లిమాయే వివరించారు. భారత్‌లో ఉన్న యువ జనాభా మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా పోటీతత్వాన్ని పటిష్టం చేసుకోగలం. భారత్ స్వయం-ఆధారిత దేశంగా అభివృద్ధి చెందుతున్న ఇలాంటి సమయంలో దీర్ఘకాలిక స్థిరమైన అభివృద్ధి, దానికనుకూల పర్యావణం, మౌలిక సదుపాయాలను నిర్మించేందుకు కృషి చేయాలని వెల్లడించారు.



Next Story

Most Viewed