వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డ్

65
Corona-Vaccine1

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌లో భారత్ మరో మైలు‌రాయి అందుకుంది. ఈ నెల 3న ప్రారంభించిన 15-18ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 2 కోట్ల డోసులు పూర్తయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సూఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. ‘వ్యాక్సినేషన్ కార్యక్రమంలో యువ మిత్రులందరూ గొప్పగా వెళ్తున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో 15-18ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ 2 కోట్లు పూర్తి చేసుకుంది’ అని ట్వీట్ చేశారు. అంతేకాకుండా శుక్రవారం దేశవ్యాప్తంగా 150కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 90 శాతం 18ఏళ్లు పైబడిన వారికి మొదటి డోసు పంపిణీ చేయడం విశేషం. మరో వైపు శుక్రవారం ఒక్కరోజులోనే 90 కోట్లు డోసులకు పైగా దేశవ్యాప్తంగా అందజేశారు.