30 ఏళ్లలో పది లక్షల జీవితాలు బలి!

by  |
Arsenic-pollution
X

దిశ, ఫీచర్స్: స్వచ్ఛత అనే మాటను జనాలు ఎప్పుడో మరిచిపోయారు. పీల్చే గాలి నుంచి తినే తిండి వరకు భూమి మీద దొరికే ప్రతీ వస్తువు కలుషితమే అవుతుండగా.. భూగర్భ జలాలు సైతం విషతుల్యంగా మారిపోతున్నాయి. ప్రపంచం సంగతి పక్కనబెడితే ఇండియాలో దాదాపు 20 శాతం వరకు భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో ఆర్సెనిక్ పదార్థాన్ని కలిగి ఉండగా.. దేశవ్యాప్తంగా 250 మిలియన్‌ పైగా ప్రజలు ఈ విష పదార్థాల బారిన పడిపడుతున్నారు.

దేశ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నన ఆర్సెనిక్ పాయిజన్ సమస్యకు సంబంధించిన డేటాను పరిశీలించినట్టయితే.. పరిస్థితి తీవ్రతపై అవగాహన పెరిగే అవకాశం ఉంది. కాగా తాగునీటిలో ఆర్సెనిక్ మూలాల వల్ల గత 30 ఏళ్లలో పదిలక్షల మంది చనిపోయారని ఇన్నర్ వాయిస్ ఫౌండేషన్ ఫౌండర్ సౌరబ్ సింగ్ వెల్లడించారు. ఈ సంస్థ.. ఆర్సెనిక్ వల్ల తలెత్తే నీటి కాలుష్య సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తోంది.

తీవ్ర సమస్యగా ఆర్సెనిక్ కాలుష్యం..

ప్రపంచవ్యాప్తంగా 108 దేశాల్లోని భూగర్భ జలాలు ఆర్సెనిక్‌తో కలుషితమైన్నట్టు రీసెండీ స్టడీ వెల్లడించింది. ప్రముఖంగా ఆసియా(32), యూరప్ (31) దేశాలతో పాటు ఆఫ్రికా(20), నార్త్ అమెరికా(11), సౌత్ అమెరికా(9), ఆస్ట్రేలియా (4) దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. కాగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగ్‌పూర్ వెల్లడించిన అధ్యయనం ప్రకారం ఇండియాలో దాదాపు 20% భూగర్భ జలాలు ఆర్సెనిక్‌తో నిండిపోయాయని, దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలతో పాటు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలను ఈ సమస్య పట్టిపీడిస్తోందని తేల్చింది. ప్రధానంగా ఇండస్-గంగా-బ్రహ్మపుత్ర రివర్ బేసిన్‌లోని రాష్ట్రాలు : పంజాబ్(92 శాతం), బీహార్(70 శాతం), వెస్ట్ బెంగాల్ (69 శాతం), అస్సాం (48 శాతం), హర్యానా(43 శాతం), ఉత్తరప్రదేశ్(28 శాతం), గుజరాత్(24 శాతం)లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు గుర్తించింది.

ఎంత పరిమితి ఆమోదయోగ్యం?

ఆమోదయోగ్యమైన పరిమితి 10 10ug/l కాగా, గత ఐదేళ్లలో ఆర్సెనిక్ కాలుష్యం దేశంలో 145% పెరిగిందని మరో అధ్యయనం వెల్లడించింది. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంత ప్రజలకే ఈ ముప్పు ఎక్కువగా ఉంది. 1990లో మొదట వెస్ట్ బెంగాల్‌లో విస్తృతంగా వెలుగుచూసిన ఈ తరహా కాలుష్యం.. ఆ తర్వాత బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మణిపూర్‌కు వ్యాపించింది. బీహార్‌ రాష్ట్రంలో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన హ్యాండ్ పంప్ వాటర్‌లోనే ఈ అవశేషాలు ఎక్కువగా ఉన్నాయని సదరు స్టడీ పేర్కొంది. అంతేకాదు ఈ రాష్ట్రంలోని 38 జిల్లాల్లో 22 వరకు పరిమితి కంటే మించి ఆర్సెనిక్ లెవెల్స్ కలిగిఉన్నట్టు స్పష్టం చేసింది.

ఏ మేరకు ప్రభావం చూపిస్తుంది?

గ్రౌండ్ వాటర్‌లో ఆర్సెనిక్ అవశేషాలు ఉంటే.. న్యూరోలాజికల్, కార్డియోవాస్కులర్ జబ్బులతో పాటు లంగ్ క్యాన్సర్, డయాబెటిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే అవకాశం ఉంది. అంతేకాదు గర్భిణులు అధిక గాఢత గల ఆర్సెనిక్ ప్రభావానికి గురైతే.. గర్భస్రావాలు, ముందస్తు జననాలు, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడంతో పాటు నవజాత శిశు మరణాలు సంభవించే అవకాశం ఉంది.



Next Story

Most Viewed