రూ. 150 కోట్ల ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభం

by  |
రూ. 150 కోట్ల ఆస్పత్రిలో ఓపీ సేవలు ప్రారంభం
X

దిశ‌, కాళోజీ జంక్షన్ : వ‌రంగ‌ల్‌లోని కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో నూత‌నంగా రూ. 150 కోట్లతో నూత‌నంగా నిర్మించిన సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో ఓపీ సేవ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్‌రావు ఇటీవ‌ల సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిని సంద‌ర్శించి త‌క్షణ‌మే వైద్య సేవ‌లు ప్రారంభించాల‌ని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో నాన్ కొవిడ్ వైద్య సేవ‌లు అందించేందుకు వైద్య అధికారులు చ‌ర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే 9 విభాగాల్లో ఓపీ సేవ‌లు అందుబాటులోకి తీసుకొచ్చారు. కేయంసీ సూప‌ర్ స్పెషాలిటీ ఆసుప‌త్రిలో ప‌ని చేయ‌డానికి డాక్టర్లను, పారా మెడిక‌ల్, సాంకేతిక సిబ్బంది ఎంపిక ప్రక్రీయ కొన‌సాగుతుంది. అందులో భాగంగా ముగ్గురు సివిల్‌ స‌ర్జన్‌లు, ఆర్‌ఎంఓలు, 16 మంది సూప‌ర్ స్పెషాలిటీ డాక్టర్లు, 7 మంది బ్రాడ్ స్పెషాలిటీ నిపుణులు, 134 మంది స్టాఫ్ న‌ర్సుల ఎంపిక పూర్తయిందని కేయంసి ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్యారాణి తెలిపారు. సెక్యూరిటి స్టాఫ్, సానిటేష‌న్ వ‌ర్కర్లు, సూప‌ర్ వైజ‌ర్లు ఎంపిక ప్రక్రీయ త్వర‌లోనే పూర్తి చేయ‌బ‌డుతుంద‌ని తెలిపారు.


Next Story